- సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా ఇదే కావడం వల్ల ఇదొక ముఖ్యమైన సందర్భంగా ప్రస్తావించారు. థియేటర్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా.. తమన్ సంగీతాన్ని అందించారు.
- హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'శశి' చిత్ర టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయికుమార్, అతని కుమారుడు అదితో పాటు చిరును మర్యాదపూర్వకంగా కలిశారు.
- 'మిషన్ మజ్ను' చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది స్టార్ హీరోయిన్ రష్మిక. ఆమె నటించిన తొలి చిత్ర ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటిస్తోంది. ఆర్ఎస్వీపీ మూవీస్ పతాకంపై రోనీ స్కూవాలా నిర్మిస్తున్నారు.
- రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన కొత్త చిత్రం '12 ఓ క్లాక్: అందర్ కా భూత్'. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేయనున్నట్లు ట్విట్టర్లో ఆర్జీవీ ప్రకటించారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.
'సుప్రీమ్' హీరో సినిమాపై మెగాస్టార్.. రష్మిక బాలీవుడ్ ఎంట్రీ - ఆది సాయికుమార్ పుట్టినరోజు వార్తలు
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సోలో బ్రతుకే సో బెటర్', 'శశి', 'మిషన్ మజ్ను'తో పాటు పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.
'సుప్రీమ్' హీరో సినిమాపై మెగాస్టార్.. రష్మిక బాలీవుడ్ ఎంట్రీ