తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు 'లూసిఫర్' రెడీ.. షూటింగ్​కు టైమ్ ఫిక్స్ - Chiranjeevi lucifer

అగ్రకథానాయకుడు చిరంజీవి.. కొత్త సినిమా కోసం సిద్ధమయ్యారు. ఆయన నటించే 'లూసిఫర్' రీమేక్ చిత్రీకరణ ఆగస్టు 13 నుంచి మొదలు కానుంది.

Chiranjeevi lucifer remake shooting starts
చిరు 'లూసిఫర్'

By

Published : Aug 12, 2021, 9:06 PM IST

Updated : Aug 13, 2021, 9:10 AM IST

మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్​ను ఫుల్​ ఖుష్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆచార్య' షూటింగ్​ దాదాపు పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు 'లూసిఫర్' రీమేక్ చిత్రీకరణకు రెడీ అయిపోయారు. ఈ షూట్ శుక్రవారం నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.

చిరు-మోహన్​రాజా-తమన్

ఈ సినిమా కోసం తమన్ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్​ సిద్ధం చేశారట. అవి మెగా అభిమానుల్ని అలరించనున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు మోహన్​రాజా, తమన్​ను కలిసిన చిరు.. వాళ్లతో కలిసి ఫొటో దిగారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇటీవల సరికొత్త లుక్​లో కనిపించిన చిరు.. ఫ్యాన్స్​ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ లుక్​ 'లూసిఫర్'​ రీమేక్​ కోసమేనని తెలుస్తోంది. అయితే ఇందులో నటించే ఇతర నటీనటులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

మలయాళ సూపర్​హిట్​ 'లూసిఫర్'. ఈ పొలిటికల్ డ్రామాలో మోహన్​లాల్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి తెలుగులో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి

ఇవీ చదవండి:

Last Updated : Aug 13, 2021, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details