చిరంజీవి వి.వి.వినాయక్ కాంబోలో ముచ్చటగా మూడోసారి సినిమాకు రంగం సిద్ధమైంది. వీరిద్దరు ఇదివరకు చేసిన రెండు చిత్రాలూ రీమేక్‌గా తెరకెక్కినవే. మూడో చిత్రమూ అదే తరహాలో రూపొందనుంది. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్' సినిమాను చూశాక ఎంతో ముచ్చటపడి.. తన తండ్రి కోసం రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేశారు రామ్‌చరణ్. ఆ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను వి.వి.వినాయక్‌కు అప్పజెప్పారు.
చిరు 'లూసిఫర్'కు ముహూర్తం అప్పుడేనా! - chiranjeevi movie updates
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వి.వి. వినాయక్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మలయాళ చిత్రం 'లూసిఫర్'కు రీమేక్‌గా దీనిని రూపొందించనున్నారు. జనవరిలో షూటింగ్ మొదలుకానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్ తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. వీరు తయారు చేసిన పూర్తిస్థాయి స్క్రిప్టును ఇటీవలే చిరంజీవి విని పచ్చజెండా ఊపేశారని సమాచారం. జనవరిలో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేయాలని ముహూర్తం నిర్ణయించినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నారు చిరు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు దర్శకులు సుజీత్, బాబీలతోనూ వరుస ప్రాజెక్టులు ఒప్పుకున్నారు. మరి ఆచార్య తర్వాత ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తారో తెలియాల్సి ఉంది.