తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి - చిరంజీవి హెల్పింగ్​ ఫౌండేషన్

మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దాసరి నారాయణరావు దగ్గర కోడైరెక్టర్‌గా పని చేసిన ప్రభాకర్​ను ఆదుకున్నారు. ప్రభాకర్​ కుమార్తె కళాశాల ఫీజు బాధ్యతను చిరంజీవి తీసుకున్నారు.

Chiranjeevi help
చిరంజీవి సహాయం

By

Published : Aug 3, 2021, 8:20 AM IST

Updated : Aug 3, 2021, 9:14 AM IST

తెలుగు చిత్రసీమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆదుకుంటారనే పేరున్న చిరంజీవి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కో-డైరెక్టర్‌ ప్రభాకర్‌ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని ఆయన కుమార్తె కళాశాల ఫీజు బాధ్యతను చిరంజీవి తీసుకున్నారు. ప్రభాకర్‌ 'లంకేశ్వరుడు' చిత్రానికి దాసరి నారాయణరావు దగ్గర కోడైరెక్టర్‌గా పని చేశారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ..

"నేను దాస‌రి వ‌ద్ద కో-డైరెక్టర్‌గా ప‌ని చేశాను. చిరంజీవి న‌టించిన 'లంకేశ్వరుడు' చిత్రానికి సహ దర్శకుడిగానూ చేశాను. ఇటీవ‌ల 'హెల్ప్ లైన్' అనే సినిమా తీశాను. ఆర్థికంగా చాలా న‌ష్టపోయా. మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తయి రెండేళ్లయ్యింది. అతడి సర్టిఫికెట్లు డ‌బ్బు చెల్లించి తీసుకురావాలి. అమ్మాయి బీబీఏ చివరి సంవత్సరానికి వ‌చ్చింది. పరీక్షలు రాయాలంటే రూ.2.5లక్షల ఫీజు కట్టాల్సి ఉంది. ఏం చేయాలో తోచని స్థితిలో చిరంజీవిగారిని ఆశ్రయించా. ఆయన మమ్మల్ని ఆదుకున్నారు. 30 ఏళ్ల క్రితం 'లంకేశ్వరుడు' సినిమా అప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నారో.. ఇప్పుడు కూడా అంతే ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయనకు, ఆయన కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాను" అని ప్రభాకర్‌ అన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ నాయిక. రామ్‌చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలోని రెండో లిరికల్‌ గీతానికి సంబంధించి ఓ ప్రకటన వెలువడనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. చరణ్‌, పూజాలపై చిత్రీకరించిన పాట విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఇదీ చదవండి:సోనూసూద్.. ఒలింపిక్స్​లో భారత్​ బ్రాండ్​ అంబాసిడర్​గా

Last Updated : Aug 3, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details