కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ప్రముఖ సినీనటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి ఇలాంటి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
కర్నూలులో ఏర్పాటు చేసిన విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించిన చిరంజీవి.. ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. దీనిని స్వాతంత్య్ర సమరయోధుడికి దక్కిన అసలైన గౌరవంగా పేర్కొన్న చిరు.. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథలో నటించడం, ఆయన పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.