తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గాడ్‌ఫాదర్‌' కొత్త షెడ్యూల్​.. హైదరాబాద్‌లో షూటింగ్​ - chiranjeevi godfather movie director

చిరంజీవి(chiranjeevi lucifer) హీరోగా తెరకెక్కుతున్న 'గాడ్​ఫాదర్'(chiranjeevi godfather movie) ​ సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఇటీవలే ఊటీలో చిత్రీకరించారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్​ సోమవారం(అక్టోబర్​ 4) నుంచి హైదరాబాద్​లో ప్రారంభంకానుంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొననుంది.

god father
గాడ్​ఫాదర్​

By

Published : Oct 4, 2021, 6:38 AM IST

చిరంజీవి(chiranjeevi lucifer) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గాడ్‌ఫాదర్‌'(chiranjeevi godfather movie). మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు(chiranjeevi godfather movie director). ఆర్‌.బి.చౌదరి, ఎన్‌.వి.ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకులు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా... మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా రూపొందుతోంది.

ఇటీవలే ఊటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. సోమవారం(అక్టోబర్​ 4) నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొననుంది. చిరంజీవితోపాటు(chiranjeevi lucifer), ఇందులో ఓ ప్రముఖ కథానాయకుడు కీలక పాత్రలో మెరిసే అవకాశం ఉంది. ఆ పాత్ర విషయంలో బాలీవుడ్‌ తారల పేర్లు కూడా వినిపించాయి. మరి అందులో ఎవరు కనిపిస్తారనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నీరవ్‌ షా కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.

ఇదీ చూడండి: ఉత్తేజ్ సతీమణి సంస్మరణ సభ.. హాజరైన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details