మెగాస్టార్ చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు తమిళనాడుకు చెందిన ఆయన అభిమానులు. చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22)ని పురస్కరించుకుని ఆనంద్, బిందు ప్రియాంక రూబిక్ క్యూబ్స్‌తో చిరంజీవి బొమ్మను రూపొందించి, అందరినీ ఆకట్టుకున్నారు. 955 రూబిక్ క్యూబ్స్‌తో దీన్ని డిజైన్ చేశారు.
రూబిక్ క్యూబ్స్‌తో 'చిరంజీవి' ఆర్ట్.. ఫిదా కావాల్సిందే! - రూబిక్ క్యూబ్
మెగాస్టార్ చిరంజీవికి తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ అశేష అభిమానులున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా రూబిక్ క్యూబ్స్‌తో ఆయన బొమ్మను తయారు చేశారు తమిళనాడుకు చెందిన ఫ్యాన్స్. మరి ఈ ఫీట్ కోసం వాళ్లెంత శ్రమించారో చూడండి..
మెగాస్టార్ చిరంజీవి
6.5 అడుగుల ఎత్తు, 5.5 అడుగుల వెడల్పు కలిగిన ఈ 'రూబిక్ క్యూబ్ చిరు' అందరినీ ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు ఆనంద్, బిందులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇదీ చూడండి:chiranjeevi birthday: మెగా ఫ్యామిలీలో సందడే సందడి