తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్యనటి శ్యామలకు మెగాస్టార్​ సాయం - పావలా శ్యామల చిరంజీవి సాయం

ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హాస్యనటి పావలా శ్యామలను ఆదుకునేందుకు మెగాస్టార్​ చిరంజీవి ముందుకొచ్చారు. రూ.1,01,500 సాయం అందించడం సహా మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​లో సభ్యత్వం అందించి.. నెలనెలా రూ.6 వేల పెన్షన్​ అందించే విధంగా సహాయపడ్డారు.

Chiranjeevi extends helping hand to senior actress Pavala Shyamala
హాస్యనటి పావలా శ్యామలకు మెగాస్టార్​ సాయం

By

Published : May 18, 2021, 9:01 PM IST

Updated : May 18, 2021, 11:11 PM IST

హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన అలనాటి నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్​ చిరంజీవి మరోసారి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ (మా) తరఫున ఆర్థిక సహాయాన్ని చేశారు. 'మా'లో సభ్యత్వం నిమిత్తం రూ.1,01,500(ఒక లక్షా 15 వందల రూపాయలు) సాయంగా ఇచ్చారు.

చెక్​ అందుకుంటున్న నటి శ్యామల

ఆ చెక్​ను మా సభ్యులైన కరాటే కల్యాణి, సురేశ్​ కొండేటి పావలా శ్యామలాకు స్వయంగా అందించారు. 'మా' అసోసియేషన్​లో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆమెకు నెలనెలా రూ.6 వేల పెన్షన్​తో పాటు రూ.3 లక్షల ఇన్సూరెన్స్​కు అర్హురాలు కానుంది.

చెక్​ను అందిస్తున్న కరాటే కల్యాణి, సురేశ్​ కొండేటి

"గతంలో నా కుమార్తెకు చికిత్స కోసం చిరంజీవి గారు రూ.2 లక్షల సాయం చేశారు. అప్పుడు సినీ పరిశ్రమలో ఎవ్వరూ సాయం చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ లక్షా పదిహేను వేల రూపాయలను చెక్​ రూపంలో అందించి.. నెలనెలా రూ.6 వేల పెన్షన్​ వచ్చేందుకు సహాయపడ్డారు. చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ఎప్పటికీ రుణపడి ఉంటాను".

- పావలా శ్యామల, సహాయ నటి

హాస్యనటి శ్యామలకు మెగాస్టార్​ సాయం

మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​లో సభ్యత్వం తీసుకున్న ప్రతి సీనియర్​ ఆర్టిస్ట్​కు నెలనెలా రూ.6 వేల చొప్పున పెన్షన్​ అందుతుంది. కరోనా కష్టకాలంలో ఇది అందరికీ వరంలా మారింది. దీంతో పాటు అసోసియేషన్​లోని సభ్యులకు మెడికల్​ ఇన్యూరెన్స్​ సదుపాయం కూడా ఉంది.

ఇదీ చూడండి..ఆర్థిక ఇబ్బందుల్లో హాస్యనటి పావలా శ్యామల

Last Updated : May 18, 2021, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details