హైదరాబాద్‌ను సందర్శించారు టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్. ఆయనను ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ. ఈ ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. తన పాత మిత్రుడిని కలవడం ఆనందాన్నిచ్చిందని అన్నారు.
"చాలాకాలం తర్వాత చిరకాల మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా అద్భుతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కలవడం మరింత ప్రత్యేకం. ఒక్కసారిగా వెనక్కు వెళ్లి నాటి స్మృతులను గుర్తుచేసుకున్నాం. మనకు తొలి ప్రపంచకప్ సాధించిపెట్టిన కపిల్‌దేవ్.. నిజంగానే హరియాణా హరికేన్."