టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వంటతో నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఇటీవలే తన తల్లి అంజనా దేవి కోసం చేపల పులుసుతో అలరించగా.. తాజాగా తన మనవరాళ్లకు కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ రుచి చూపించారు. తన మనవరాళ్లు సంహిత, నివ్రితిలతో కలిసి కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ తయారు చేశారు.
కేఎఫ్‌సీ చికెన్‌తో అదరగొట్టిన మెగాస్టార్ - మనవరాళ్లతో చిరు కేఎఫ్‌సీ చికెన్
మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ వండారు. చిన్నారులతో కలిసి వంట చేయడం చాలా సరదాగా అనిపించిందని తెలుపుతూ దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మనవరాళ్లతో కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ వండిన మెగాస్టార్
మనవరాళ్లు తన సహాయకులని, వారితో కలిసి వంట చేయడం చాలా సరదాగా అనిపించిందని చిరు చెప్పారు. అంతేకాదు వారితో కలిసి రోడ్డు పక్కన బండిపెట్టుకుని 'కేఎఫ్‌సీ చికెన్..' అమ్మేంతగా నిపుణులు అయ్యారని కితాబిచ్చారు.
Last Updated : Nov 1, 2020, 8:59 PM IST