Chiranjeevi congrats to Pushpa: అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమా 'పుష్ప'. భారీ అంచనాలతో డిసెంబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు నుంచి పలువురు సినీసెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'పుష్ప' సినిమా గురించి స్పందించారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.
"ఈ సినిమా కోసం రక్తం, చెమట చిందించి నిబద్ధతతో పనిచేశారు. మీరు పడ్డ కష్టానికి ప్రశంసలు దక్కాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నా."