తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు లీక్స్​: కొత్త సినిమాపై మెగాస్టార్​ క్లారిటీ - చిరంజీవి వార్తలు

'ఆచార్య' చిత్రీకరణ పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో నటించనున్నారు మెగాస్టార్​ చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ చిత్రాన్ని నిర్మించనుందని 'ఉప్పెన' సినిమా ప్రీ-రిలీజ్​ ఈవెంట్​లో​ స్వయంగా చిరూనే వెల్లడించారు.

Chiranjeevi confirmed new movie with mythri movie makers in Bobby Direction
చిరు లీక్స్​: కొత్త సినిమాపై మెగాస్టార్​ క్లారిటీ

By

Published : Feb 7, 2021, 12:34 PM IST

యువ దర్శకుడు కేఎస్​ రవీంద్ర​(బాబీ)తో ఓ సినిమా చేస్తున్నట్లు మెగాస్టార్​ చిరంజీవి స్పష్టం చేశారు. ఆ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మాణ బాధ్యతలు వహిస్తుందని తెలిపారు. శనివారం ఉప్పెన ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

చిరు ప్రస్తుతం 'ఆచార్య' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ అగర్వాల్​ కథానాయిక. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​.. 'సిద్ధ' అనే కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:నీ నవ్వుతో మాయ చేయకు..'బేబమ్మ'!

ABOUT THE AUTHOR

...view details