మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'భోళా శంకర్'(chiranjeevi bhola shankar movie remake) సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో వేడుకగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు(chiranjeevi bhola shankar). ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్ కొట్టారు.
చిరు 'భోళాశంకర్' సినిమా షూటింగ్ షురూ - bhola shankar movie shooting
చిరంజీవి కథనాయకుడిగా నటిస్తున్న 'భోళాశంకర్'(chiranjeevi bhola shankar movie remake) సినిమా షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది(chiranjeevi bhola shankar). ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్, హీరోయిన్గా తమన్నా నటించనున్నారు.
తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న 'వేదాళం'9vedalam remake telugu) రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇందులో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనున్నారు. అలాగే మెగాస్టార్‌కు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు. మణిశర్మ కుమారుడు మహతి సాగర్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: బాలకృష్ణ కొత్త సినిమా, చిరంజీవి 'భోళా శంకర్' అప్డేట్స్