వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు చిరంజీవి(chiranjeevi bhola shankar movie). ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'గాడ్‌ఫాదర్'(chiranjeevi godfather movie) సెట్స్‌పై ముస్తాబవుతోంది.
కాగా.. ఇప్పుడాయన కొత్తగా 'భోళా శంకర్'ను(chiranjeevi bholashankar movie cast) పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో విజయవంతమైన 'వేదాళం'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు(chiranjeevi bhola shankar movie director). ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలందిస్తున్నారు. శుక్రవారం మహతి పుట్టినరోజు. ఈ సందర్భంగా గురువారం ఓ కొత్త పోస్టర్ విడుదల చేసి, ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు స్పష్టత ఇచ్చారు.