ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహం బుధవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, ఈ జంటను దీవించారు. ఈ వేడుకలో బాలకృష్ణ, చిరంజీవి ఏదో విషయమై ముచ్చటించారు. వారు ఏం మాట్లాడుకున్నారో? అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది.
చిరు- బాలయ్య ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు? - చిరంజీవి, బాలకృష్ణ
దర్శకుడు కోడి రామకృష్ణ రెండో కూతురి వివాహం సందర్భంగా కలిసిన అగ్రహీరోలు చిరంజీవి-బాలకృష్ణ.. పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటున్న ఓ ఫొటో వైరల్గా మారింది.
![చిరు- బాలయ్య ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు? Chiranjeevi, Balakrishna Funny Moments at Kodi Ramakrishna Daughter Marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5982104-599-5982104-1580994833950.jpg)
చిరు- బాలయ్య ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు?
ప్రస్తుతం సినిమాల్లో చిరు బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. బాలకృష్ణ.. ఓ వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, దర్శకుడు బోయపాటితో మూడోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ కార్యక్రమంలో చిరు-బాలయ్య సినిమాలు గురించి మాట్లాడుకున్నారా? మరే ఇతర విషయమైనా చర్చించారా? అనేది సస్పెన్స్.
ఇదీ చదవండి: చాలా రోజుల తర్వాత మహేశ్ మళ్లీ అలా!
Last Updated : Feb 29, 2020, 10:42 AM IST