టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి విషయంలోనూ వీరిద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలవడం మనం చాలాసార్లు చూశాం. తాజాగా వీరి స్నేహం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నాగార్జునను ఇంటికి పిలిచారు చిరంజీవి. వీరిద్దరూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో నాగ్ కోసం స్వయంగా వంట చేశారు చిరు. ఈ విషయాన్ని నాగ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.