తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతకు 'చిరు' సత్కారం - వీణాపాణికి చిరంజీవి అభినందనలు

లండన్​లో 61 గంటలపాటు వీణావాదం చేసి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన ప్రముఖ సంగీత దర్శకుడు వీణాపాణిని సత్కరించాడు మెగాస్టార్ చిరంజీవి. తన నివాసంలో ఆయనను అభినందించాడు చిరు.

చిరంజీవి

By

Published : Oct 29, 2019, 12:49 PM IST

గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతకు 'చిరు' సత్కారం

ప్రముఖ సంగీత దర్శకుడు స్వర వీణాపాణిని మెగాస్టార్ చిరంజీవి అభినందించాడు. తన నివాసంలో ఆయనను సత్కరించాడు చిరు. లండన్ వేదికగా జరిగిన మ్యూజిక్ మారథాన్​లో వీణాపాణి 61 గంటల పాటు వీణావాదం చేసి గిన్నిస్ బుక్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నాడని తెలిపాడు.

అక్టోబర్ 2న సంగీతంలోని విశిష్టతను ప్రపంచానికి తెలిపే 72 రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాలు వీణావాదం చేశాడు వీణాపాణి. ఈ ఘనతతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించాడు.

వీణాపాణికి గిన్నిస్ బుక్ రికార్డు

తనికెళ్ల భరణి, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు వీణాపాణికి అభినందనలు తెలిపారు. తనికెళ్ల భరణి తెరకెక్కించిన 'మిథునం' సినిమాకు సంగీతం సమకూర్చాడు వీణాపాణి.

వీణాపాణి

ఇదీ చదవండి: తాడేపల్లిగూడెంకు స్టార్ యాక్టర్.. మహిళల పరుగులు

ABOUT THE AUTHOR

...view details