తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్లాక్​బస్టర్​ రీమేక్​తో చిరు, నాగ్​ మల్టీస్టారర్! - నాగ్ చిరు చిత్రం

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి మల్టీస్టారర్​ చేయనున్నారా? ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్​లో చర్చనీయాంశమవుతోంది. ఈ స్టార్ హీరోలిద్దరూ 'విక్రమ్ వేదా' తెలుగు రీమేక్​లో(Vikram Vedha Telugu Remake)​ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

chiranjeevi and nagarjuna
చిరు, నాగ్ మల్టీస్టారర్

By

Published : Sep 25, 2021, 8:25 AM IST

Updated : Sep 25, 2021, 9:59 AM IST

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అలనాటి ఎన్టీఆర్- ఏఎన్నార్​ నుంచి ఇప్పటి జూ.ఎన్టీఆర్- రామ్​చరణ్​ వరకు.. ఎప్పుడు మల్టీస్టారర్ సినిమా వచ్చినా.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి తెరను పంచుకోనున్నారని సమాచారం. తమిళ బ్లాక్​బస్టర్ 'విక్రమ్ వేదా' తెలుగు రీమేక్​లో(Vikram Vedha Telugu Remake)​ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదే నిజమైతే.. తెలుగులో మరో బిగ్గెస్ట్​ మల్టీస్టారర్​ చిత్రం ఇదే అవుతుంది! మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ సూపర్​హిట్ చిత్రాన్ని హిందీలో రిమేక్ చేస్తున్నారు. స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్​ అలీఖాన్​ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య'(Acharya Movie Release Date) ఇప్పటికే షూటింగ్​ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు గాడ్​ఫాదర్, 'భోళాశంకర్'​, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చిరు చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం 'బంగార్రాజు', 'ది ఘోస్ట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఇదీ చదవండి:ఈ రోజు నేను అస్సలు మర్చిపోలేను: చిరంజీవి

Last Updated : Sep 25, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details