ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు నటుడు, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్, మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కమల్ ట్వీట్ చేయగా.. చిరు ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
" ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసాధారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పెనువిపత్తు నుంచి కాపాడుకోవడానికి సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉందాం. దీనికి మద్దతు ఇవ్వాలంటూ నా అభిమానులు, మిత్రులను కోరుతున్నాను."
-కమల్‌హాసన్, కథానాయకుడు.
ఈ ట్వీట్‌ను విజయ్, అజిత్, రజనీకాంత్, సూర్య, ధనుష్, విజయ్ సేతుపతి, శింబు తదితర తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశాడు కమల్.