ఇటీవలే ‘సైరా’కి గుమ్మడికాయ కొట్టేశారు. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలెట్టేశారు చిరంజీవి. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా తన 152వ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు మెగాస్టార్.
చిరు తర్వాతి సినిమాలో డబుల్ ధమాకా..! - రామ్‌చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు మెగాస్టార్ చిరంజీవి. జులైలో చిత్రీకరణ ప్రారంభమయ్యే ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం.
చిరు తర్వాతి సినిమాలో డబుల్ ధమాకా..!
ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. జులై మొదటి వారంలో షూటింగ్ మొదలు కానుంది. హైదరాబాద్ శివార్లలో ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. తొలి షెడ్యూల్ అక్కడే ప్రారంభం కానుంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారు. నయనతార హీరోయిన్గా నటించనుందని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు.
ఇది చదవండి: 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క పాత్ర అదేనా..!