గతకొన్నిరోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' విడుదల(acharya movie release date) అప్పుడు, ఇప్పుడు అంటూ పలు తేదీలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ చిత్రబృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
ఇందులో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.