మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'(అధికారికంగా ప్రకటించాల్సి ఉంది). కాజల్ కథానాయిక. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.
'ఆచార్య' కోసం ఆ నిర్ణయం తీసుకున్నారా? - చిరంజీవి తాజా వార్తలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలంటే భారీ బడ్జెట్ ఉండాల్సిందే. భారీ తారాగణం, యాక్షన్ సన్నివేశాలు వెండితెరపై చూస్తుంటే వచ్చే మజానే వేరు. పైగా పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే, కరోనా కారణంగా ప్రతి రంగమూ నష్టపోయింది. ఇందుకు చిత్ర పరిశ్రమ అతీతం కాదు. ఇది భారీ బడ్జెట్ చిత్రాలపై పెను ప్రభావం చూపనుంది. ఇప్పుడు 'ఆచార్య' విషయంలో చిత్రబృందం ఓ నిర్ణయం తీసుకుందట. బడ్జెట్‌లో కోత విధించినట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేయనున్నారు. అయితే, అవి కథ, కథనాలపై పెద్దగా ప్రభావం చూపవని చిత్రబృందం భావిస్తోంది. దీనిపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్. రామ్‌చరణ్ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అటు కొరటాల, ఇటు చిరు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు సుజీత్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారు.