'కరోనా క్రైసిస్ ఛారిటీ' (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. నాగార్జున నటించిన 'వైల్డ్‌డాగ్' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిన చిత్రమిదని అన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాన్ని అందించిన దర్శక నిర్మాతలను కొనియాడారు. టాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు.
సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా: చిరు - చిరంజీవీ కరోనా ఉచిత టీకా
కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి
అనంతరం సినీ కార్మికుల గురించి మాట్లాడుతూ.. "గతేడాది కరోనా వైరస్ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల్లో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేశాం. అందులో ఇంకొంత మొత్తం మిగిలి ఉంది. దానితో సినీ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఇప్పించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం" అని చిరు తెలిపారు.