తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2022, 4:03 PM IST

Updated : Mar 27, 2022, 4:13 PM IST

ETV Bharat / sitara

యాక్షన్​ మోడ్​లో 'చిరు 154'.. 'సూపర్​ గర్ల్'​ మూవీ షూటింగ్​ షురూ

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి 154, 'ఆర్​ఆర్​ఆర్'​, సూపర్​ గర్ల్​ 'ఇంద్రాణి' చిత్రాల సంగతులు ఉన్నాయి. అవన్నీ మీకోసం...

chiru
చిరు

Chiranjeevi 154 movie: మెగాస్టార్​ చిరంజీవి కొత్త సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఒప్పుకోవడంలోనే కాదు, వాటిని పూర్తి చేయడంలోనూ అదే వేగం ప్రదర్శిస్తున్నారు. వరుస చిత్రాల షూటింగ్​లలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం 'గాడ్​ఫాదర్'​ చిత్రీకరణలో పాల్గొంటూనే బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'మెగా154' కోసం ఆయన రంగంలోకి దిగారు. ప్రస్తుతం చిరు, ఇతర చిత్రబృందంపై పోరాట ఘట్టాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్​ చిత్రీకరణతో చిరు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ యాక్షన్​ సీన్స్​కు రామ్​-లక్ష్మణ్​ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కాగా, ఈ మూవీలో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటిస్తోంది.

చిరు 154

Supergirl movie Indrani movie: సూపర్​ హీరోస్​, సూపర్​ హీరోయిన్స్ చిత్రాలను ఎక్కువగా హాలీవుడ్​లో మాత్రమే చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో భారత చిత్రసీమలోనూ 'క్రిష్​' సిరీస్​ తర్వాత సూపర్​ హీరోస్​ చిత్రాలను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.​ అయితే సూపర్​ గర్ల్​ చిత్రాలు లేవు. ఇప్పుడా ఆ లోటు కూడా భర్తీ కానుంది. ఎప్పుడూ చూడని విభిన్నమైన కథాంశంతో 'ఇంద్రానీ' అనే తొలి ఇండియన్​ సూపర్​ గర్ల్​ సినిమాను తెరెకెక్కించనున్నారు. నేడు(ఆదివారం) ఈ సినిమా పూజాకార్యక్రమాలతో షూటింగ్​ ప్రారంభించుకుంది. సీనియన్​ నటుడు నరేష్​ క్లాప్​ కొట్టగా.. బెక్కం వేణుగోపాల్​ కెమెరా స్విచ్​ ఆన్​ చేశారు. ఈ మూవీకి యాక్షన్​ సన్నివేశాలతో పాటు కమర్షియల్​ హంగులు జోడించనున్నారు. ఈ చిత్రంతో స్టీఫెన్​ దర్శకుడిగా పరిచయం కానున్నారు. చోటాకే ప్రసాద్​ ఎడిటింగ్​ బాధ్యతలు తీసుకున్నారు. సాయికార్తీక్​ సంగీతం అందించనున్నారు. యానియాభరద్వాజ్​, కబీర్​ధుహాన్​ సింగ్​ సహా తదితురులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

RRR Rajamouli: అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలనని దర్శకుడు రాజమౌళి మరోసారి నిరూపించారని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వీక్షించిన అనంతరం ట్విట్టర్​లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన శోభు యార్లగడ్డ.... రాజమౌళి ప్రయాణంలో తాను ఒక భాగం కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రాంతీయమా, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రమా అనే విషయాలు అనవసరమని, పెద్ద కలలను కనడం, వాటిని సాకరం చేసేందుకు కష్టపడానికి ఆర్ఆర్ఆర్ ఉదాహారణగా నిలుస్తుందన్నారు. అలాగే దర్శకుడు ఆర్జీవీ కూడా ఆర్ఆర్ఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమలో 'బాహుబలి' ఒక చరిత్ర అయితే 'ఆర్ఆర్ఆర్' చిత్రం చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి బాక్సాఫీసును ఆధ్యాత్మికంగా మార్చారని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ భారీ స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. విదేశాల్లో గత తెలుగు చిత్రాల రికార్డులను అధిగమించి కలెక్షన్లు కొల్లగొడుతుండగా... తెలుగు రాష్ట్రాల్లోనూ విశేష ప్రేక్షకాదరణతో హౌస్ పుల్ కలెక్షన్లను రాబడుతోంది.

ఇదీ చూడండి: చరణ్​ చేతుల మీదుగా 'కేజీఎఫ్​2' ట్రైలర్​.. రిలీజ్​ డేట్​తో రామ్​

Last Updated : Mar 27, 2022, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details