మెగా అల్లుడు కల్యాణ్ దేవ్.. పులివాసు అనే నూతన దర్శకుడితో ప్రస్తుతం ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఏ దశలో ఉందో ఇంత వరకు తెలియలేదు. తాజాగా కల్యాణ్ మరో కొత్త దర్శకుడితో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాయి కిషోర్ మచ్చ అనే యువ దర్శకుడు ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో కల్యాణ్‌ను మెప్పించాడట.
'మెగా' మామ ఆమోదం... అల్లుడు సిద్ధం! - హీరో మెగస్టార్ , అల్లుడు కల్యాణ్‌దేవ్
మెగా.. ఆ పేరో బ్రాండ్... మరి అలాంటి మెగా కుటుంబం నుంచి ఒకరి సినిమా వస్తుంది అంటే అభిమానుల్లో భారీ అంచనాలే ఉంటాయి. మెగా అల్లుడు బ్రాండ్ ఇమేజ్‌తో 'విజేత' చిత్రంతో మెరిశాడు కల్యాణ్ దేవ్. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మిశ్రమ ఫలితం దక్కించుకుంది. కానీ కల్యాణ్ మాత్రం ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. ఈ హీరో మరో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి మెగాస్టార్ ఓకే చెప్పేశాడట. అంతేకాదు ఈ సినిమా తన అల్లుడికి మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడట చిరంజీవి.
'మెగా' మామ ఆమోదం... అల్లుడు సిద్ధం!
మెగాస్టార్ ఆమోదం..
కల్యాణ్ నటించనున్న ఈ చిత్రానికి చిరంజీవి ఆమోదముద్ర వేశాడట. తన అల్లుడికి ఈ సినిమా మంచి పేరు తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడట మెగాస్టార్. ఓ స్ర్పింటర్ నిజ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ పాత్ర కోసం కల్యాణ్ తన బాడీని ప్రొఫెషనల్ అథ్లెట్‌లా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇప్పటికే ఇందుకోసం కసరత్తులు ప్రారంభించాడటీ హీరో.