తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 2:49 PM IST

ETV Bharat / sitara

ప్రకృతి కవి, ఫొటోగ్రాఫర్​గా మారిన చిరు

మెగాస్టార్ చిరంజీవి తనలోని ఫొటోగ్రాఫర్, కవిని బయటకు తీశారు. ఆయన ఇంట్లో పూసిన మందారాలను సూర్యోదయ సమయంలో క్లిక్​మనిపించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

Chiranajeevi Shares Adorable sun rise photo
ప్రకృతి కవి, కెమెరామెన్​గా మారిన చిరు

లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది సినీతారలు తమకు ఇష్టమైన వ్యాపకాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. వాళ్ల అభిరుచులను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఖాతాలను తెరిచారు. అప్పటి నుంచి అభిమానులకు కొత్త సంగతులు చెప్తూ అలరిస్తున్నారు. తాజాగా తన ఇంటి వద్ద పూసిన మందార మకరందాలను అందంగా ఫొటోలు తీశారు చిరు. అంతేనా వాటిపై సరికొత్తగా కవిత కూడా అల్లారు.

"ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది.. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది !.." అంటూ తనలోని ప్రకృతి కవిని మనకు పరిచయం చేశారు చిరంజీవి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు చిరు. కాజల్‌ కథానాయక. త్వరలోనే తిరిగి షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details