ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ సమయాన్ని కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఆమె కేటాయించారు. గత ఆరు నెలల్లో దాదాపు 3వేల ఆడియోలు రికార్డు చేశారు. వీటిని శ్రోతలకు షేర్ చేసి.. రూ.85 లక్షల విరాళం సేకరించారు.
గత కొన్ని రోజులుగా ప్రజల కోరిక మేరకు.. నేను వ్యక్తిగతంగా పాటల్ని అంకితం చేయడం, శుభాకాంక్షలు చెప్పడం.. చేస్తున్నా. ఇప్పటివరకు 3 వేల వీడియోలు పంపా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది దాతలు డబ్బును నేరుగా అవసరాల్లో ఉన్న వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇప్పటివరకు రూ.85 లక్షల విరాళం సేకరించా. ఇలాంటి క్లిష్టసమయంలో నిత్యావసర సరకులు కూడా కొనలేని స్థితిలో ఉన్న వారి కోసం, ఫీజులు కట్టలేని వారి కోసం.. ఈ కార్యక్రమాన్ని నేను ఇలానే కొనసాగించాలనుకుంటున్నా.