డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవికి గాయని చిన్మయి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. సరిపడ అర్హతలు లేకపోవడం వల్ల ఆమె అనర్హురాలిగా ప్రకటించారు. ఫలితంగా ఈ పదవికి రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి నామినేషన్లను మాజీ న్యాయమూర్తి రవి పరిశీలించారు.
చిన్మయికి చుక్కెదురు.. నామినేషన్ తిరస్కరణ - చిన్మయి నామినేషన్
డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో గాయని చిన్మయికి చేదు అనుభవం ఎదురైంది. సరిపడ అర్హతలు లేనందున ఆమె నామినేషన్ను తిరస్కరించారు.
చిన్మయికి చుక్కెదురు.. నామినేషన్ తిరస్కరణ
తన నామినేషన్ తిరస్కరించడంపై షాకయ్యానని, యూనియన్లో సభ్యురాలిగా తొలగించారని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పింది చిన్మయి. ఈ విషయమై కోర్టును ఆశ్రయించగా, ఆమెను సభ్యురాలిగా తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. తన నామినేషన్ తిరస్కరణపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది చిన్మయి. ఈ ఎన్నికల్ని సరిగా నిర్వర్తించలేదని పేర్కొంది.
ఇదీ చదవండి: వారికి విరాళమిచ్చిన హీరో అల్లు అర్జున్
Last Updated : Feb 29, 2020, 7:57 AM IST