లాక్డౌన్ సమయంలో ఎవరికి కష్టమొచ్చినా ఇప్పుడు గుర్తొచ్చే పేరు బాలీవుడ్ నటుడు సోనూసూద్. వలస కూలీలు, విద్యార్థులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దిల్లీ తిహార్కు చెందిన ఇద్దరి చిన్నారులు సోనూ చేసే సాయానికి అండగా నిలవాలనుకున్నారు. అంతే ఎప్పటినుంచో పిగ్గీ బ్యాంక్లో పోగు చేసుకున్న డబ్బును సోనూకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
సోనూకే సాయం చేస్తామంటున్న చిన్నారులు - corona news updates
లాక్డౌన్ వేళ వేలాది మందికి అండగా నిలుస్తున్న సోనూసూద్ ఔదార్యానికి ఇద్దరు చిన్నారుల మనసు కరిగిపోయింది. అంతే, వెంటనే ఎప్పటి నుంచో పిగ్గీ బ్యాంక్లో దాచుకున్న డబ్బును.. సోనూకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
సోనూకే సాయం చేస్తామంటున్న ఇద్దరు చిన్నారులు
ఈ క్రమంలోనే ఈటీవీ భారత్తో ఆ చిన్నారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. "వెండితెరపై విలన్గా కనిపించే వ్యక్తి.. నిజ జీవితంలో రియల్ హీరోగా శ్రమిస్తున్నాడు. ఎంతో మందికి సకాలంలో చేయూతనందించి వారి ప్రాణాలను కాపాడుతున్నాడు" అని పేర్కొన్నారు.
ఇటీవలే ఓ రైతుకు ట్రాక్టర్ను కొనివ్వడం ఎంతో నచ్చిందని తెలిపారు. తమ తల్లిదండ్రుల సాయంతో ఎలాగైనా సోనూకు ఈ డబ్బు అందేలా చేస్తామని చెప్పారు. తద్వారా మరికొంత మందికి సోనూ సాయం చేసేందుకు వీలుంటుందని వివరించారు.