తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా పర్లేదు.. కానీ: రకుల్

కొన్ని చిత్రాల్లో పాత్ర నిడివి తక్కువైనా.. వాటి ప్రభావం సినిమా మొత్తం కనిపిస్తుందని అంటోది హీరోయిన్​ రకుల్​ప్రీత్​. కమర్షియల్​ సినిమాల్లో కనిపించేది కొద్దిసేపయినా ప్రేక్షకులకు వినోదాన్ని అందిచడం ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతోంది.

chichat with Actress Rakulpreet Singh
'పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా.. వినోదాన్ని అందిస్తే చాలు'

By

Published : May 15, 2020, 7:29 AM IST

కథా బలమున్న చిత్రాల్లో పాత్ర నిడివి తక్కువ ఉన్నా పర్లేదంటోది నటి రకుల్​ప్రీత్ ​సింగ్​. మరోవైపు కమర్షియల్​ సినిమాల్లోనూ కొన్ని సన్నివేశాలకే పరిమితం కావడంపై సమాధానమిచ్చింది.

ప్రశ్న: కమర్షియల్‌ చిత్రాల్లో నాయికలు కొన్ని సీన్లు.. పాటలకే పరిమితమవుతుంటారు. ఆ చిత్ర విజయాలు నటిగా సంతృప్తినిస్తాయా?

రకుల్‌ప్రీత్‌ సింగ్‌: కచ్చితంగా ఇస్తాయి. వాణిజ్య ప్రధాన చిత్రాలు బలమైన కథ, చక్కటి వినోదం, నాయకానాయికల ఇమేజ్‌.. ఇలా అనేక అంశాల సమ మేళవింపుగా ఉంటాయి. ఇక పాటలు భారతీయ సినిమాలో భాగం. ప్రేక్షకులు పాటల నుంచీ వినోదాన్ని కోరుకుంటారు. కాబట్టి అందం, అభినయాలతో పాటు నృత్యాలతోనూ వారిని ఆనందింపజేయడంలో నటిగా సంతృప్తి దొరుకుతుంది. కథా బలమున్న చిత్రాల్లో కొన్నిసార్లు మన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. దాని ప్రభావం సినిమా మొత్తం కనిపిస్తుంటుంది.

"ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటుంది. ఇదీ నటిగా సంతృప్తినిచ్చే అంశమే. అందుకే కథల ఎంపికలో పాత్ర నిడివిపైనే దృష్టి పెట్టకూడదు. ఆ పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తామా.. ఆ పాత్ర చిత్ర విజయానికి కీలకమౌతుందా? అన్న అంశాల్ని బేరీజు వేసుకోవాలి".

ఇదీ చూడండి.. దేవదాసు గెటప్​ నుంచి 'ఇస్మార్ట్​'గా మారిన రామ్

ABOUT THE AUTHOR

...view details