శివ కందుకూరి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'మనుచరిత్ర'(manu charitra telugu movie). నేడు(అక్టోబర్ 7) ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో విడుదలై ఆకట్టుకుంటోంది. భరత్‌కుమార్ పెదగోని దర్శకుడు. మేఘాఆకాశ్ హీరోయిన్.
హీరో ఆది(hero adi new movie) కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దసరా పండగ రోజు ఉదయం 9.45గంటలకు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. శివశంకర్ దేవ్ దర్శకుడు. అజయ్ శ్రీనివాస్ నిర్మాత.
వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'కొండపొలం'(Kondapolam movie). ఈ సినిమాలోని 'చెట్టెక్కి' లిరికల్ వీడియో సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో గీతాలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
శర్వానంద, రష్మిక(aadavallu meeku joharlu rashmika) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'(adavallu meeku joharlu movie release date). సీనియర్ నటులు రాధిక, ఊర్వశి, ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా నేడు(అక్టోబర్ 7) రష్మిక, రాధిక, ఊర్వశి కలిసి ఓ పాత పాటను పాడుతున్న ఓ వీడియోను ట్వీట్ చేసింది చిత్రబృందం.
ఇదీ చూడండి: ప్రభాస్ 25వ సినిమా ఫిక్స్.. ఈసారి ఎనిమిది భాషల్లో