తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రణ్​బీర్​కు అమితాబ్ ఖరీదైన గిఫ్ట్.. ధరెంతో తెలుసా? - అమితా బచ్చన్​ రణ్​వీర్​ కపూర్​ బంధం

యువ కథానాయకుడు రణ్​బీర్​ కపూర్​పై(Ranbir Kapoor Brahmastra) తన అభిమానాన్ని సోషల్​ మీడియా వేదికగా తరచూ చాటుకుంటారు బాలీవుడ్​ మోగాస్టార్​ అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan and Ranbir Kapoor relation)​. అలాగే ఓసారి ఖరీదైన వాచ్​ను గిఫ్ట్​గా ఇచ్చి రణ్​బీర్​ను థ్రిల్​ చేశారు బిగ్​బీ. దాని ధరెంతో తెలుసా?

Amitabh Bachchan, Ranbir Kapoor
అమితాబచ్చన్​, రణ్​వీర్​ కపూర్​

By

Published : Sep 10, 2021, 1:58 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్​ ఉంది. ఎందరో యువ కథానాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి అమితాబ్​.. యువ కథానాయకుడు రణ్​బీర్​ కపూర్​కు బిగ్​ ఫ్యాన్(Amitabh Bachchan and Ranbir Kapoor relation)​. సోషల్​ మీడియా ద్వారా తన అభిమానాన్ని ఎప్పటికప్పడూ చాటుకునే బిగ్​బీ.. రణ్​వీర్​కు ఖరీదైన వాచ్​ను గిఫ్ట్​గా ఇచ్చారు.

అమితాబచ్చన్​, రణ్​వీర్​ కపూర్​

2014లో రణ్​బీర్​కు (Ranbir Kapoor Brahmastra) రిచర్డ్​ మిల్లె ఆర్​ఎం 010 వాచ్​ను గిఫ్ట్​గా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు బిగ్​బీ. ఆ వాచ్​ విలువ రూ.50 లక్షలు. ఖరీదైన వాచ్​లు, కార్లు వంటి వస్తువుల పట్ల మక్కువ ఉన్న రణ్​బీర్​కు ఆ వాచ్ ఎంతగానో నచ్చింది. అయితే రణ్​బీర్​కు బిగ్​బీ అంత ఖరీదైన వాచ్​ ఇవ్వడం వెనుక ఓ కారణం ఉంది.

రిచర్డ్​ మిల్లె ఆర్​ఎం 010 వాచ్​

బిగ్​బీట 'భూత్​నాథ్​ రిటర్న్స్'​ సినిమాకు మద్దతిచ్చాడు రణ్​బీర్​. అలాగే ఈ ఈవెంట్​కు అమితాబ్​ ఆ వాచ్​ పెట్టుకుని వచ్చారు. అది చూసిన రణ్​బీర్​.. బిగ్​బీ స్టైల్​ను ప్రశంసించాడు. దీంతో ఆ వాచ్​ను గిఫ్ట్​గా ఇవ్వాలని భావించిన అమితాబ్​.. భూత్​నాథ్​ సినిమాను ప్రమోషన్ చేసినందుకు కృతజ్ఞతగా.. 2014లో ఆర్​ఎం 010 వాచ్​ను రణ్​బీర్​కు బహుకరించారు.

ప్రస్తుతం వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' (Amitabh Bachchan Brahmastra)సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి:'అన్నాత్తే' ఫస్ట్​లుక్ అదుర్స్.. 'ఖిలాడి' సాంగ్ వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details