నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తీసిన చిత్రం 'చెక్'. ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రీత్, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. ఆనంద్‌ప్రసాద్ నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతదర్శకుడు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో ఈటీవీ ముచ్చటించింది. ఈ సందర్భంగా నితిన్, ప్రియాప్రకాశ్, సాయిచంద్, హర్ష.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం..?
నితిన్: ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందే ఒక భిన్నమైన సినిమా చేయాలని నాలో ఆలోచన ఉంది. ఆ సమయంలోనే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ లైన్ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. దాదాపు 20 నిమిషాల్లో కథ చెప్పేశారు. ఒక ఖైదీ చెస్ నేర్చుకొని గ్రాండ్ మాస్టర్ అవుతాడు.. ఆ తర్వాత క్లైమాక్స్. ఆయన చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. నేను చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. అందుకే వెంటనే నేను సినిమాకు ఓకే చెప్పాను.
సినిమా ఔట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నారా..?
నితిన్: మేము ఎలా రావాలని కోరుకున్నామో ఔట్‌పుట్ సినిమా అలాగే వచ్చింది. సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాను. ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. అందరూ ఒక కొత్త నితిన్‌ను చూడబోతున్నారు. సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.
నితిన్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది..?
సాయిచంద్: చంద్రశేఖర్ యేలేటి గారు తీసిన ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమా చూశాను. ఎంతో థ్రిల్‌కు గురయ్యాను. డైరెక్టర్ ఇలా.. ఎలా.. ఆలోచించగలిగాడా..? అని ఆశ్చర్యానికి గురయ్యాను. నితిన్ గురించి చెప్పాలంటే. ఎన్నో సినిమాలు చేసిన అంత పెద్ద హీరో మాతో అంత అణుకువగా ఉంటాడని అనుకోలేదు. మాతో కలిసి చెస్ ఆడటం.. నేర్చుకోవడం.. ఇలా మా ఇద్దరి మధ్య తెలియకుండానే ఆత్మీయ అనుబంధం ఏర్పడింది.
నితిన్: మామూలుగా సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. ఈ సినిమాలో మాత్రం మా ఇద్దరి మధ్య ఉంటుంది(నవ్వుతూ) ఇద్దరం గొడవపడుతూ.. కొట్లాడుతూ ఉంటాం.
మీకు అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది..?
ప్రియావారియర్: ఈ అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ‘మనమంత’ సినిమా చూశాను. నా పాత్ర విన్నతర్వాత ఈ సినిమా చేస్తానని వెంటనే చెప్పాను. నితిన్, రకుల్ లాంటి పెద్ద స్టార్లున్న సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం.
నితిన్‌ను సీరియస్ పాత్రలో చూడటం ఎలా ఉంది..?