నాగచైతన్య, సమంత విడిపోయారు(chaysam divorce).. అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. వాళ్లు కలిసి ఉండాలనీ, తెరపై మళ్లీ జంటగా నటించాలనుకున్న వాళ్లకు ఈ వార్తలు, తదనంతర పరిణామాలు బాధ కలిగించాయి. కలిసి ఉండలేనప్పుడు విడిపోవటమే మంచిదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు కారణాలపై మాత్రం ఇరువురూ నోరు విప్పలేదు. వీళ్లే కాదు.. వివిధ కారణాలతో వేరుపడ్డ సాత్ఇండియా సినిమా జంటలు చాలానే ఉన్నాయి. వాళ్లెవరు? ఎందుకు విడిపోయారో చూద్దాం!
నయనతార- ప్రభుదేవా
ఈ స్టార్ జంటది పదమూడేళ్ల ప్రేమకథ. చాలా ఏళ్లపాటు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచారు. 2000 సంవత్సరంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ప్రభుదేవాకి అప్పటికే రమాలత్‌తో పెళ్లైంది. మొదట్లో మేం ‘జస్ట్ ఫ్రెండ్స్’ అనేవాళ్లు. అంతకుమించి ఉందని మీడియా వార్తలు రాస్తూనే వచ్చింది. ‘నయన్ నా భర్తను వెంట తిప్పుకుంటోంది. వాళ్లిద్దరి మధ్య సంబంధంతో ప్రభుదేవా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు’ అంటూ రమాలత్ ఫిర్యాదు కూడా చేశారు. చివరికి ఆమె చెప్పిందే నిజమైంది. రమాలత్, ప్రభుదేవా 2010లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. నయనతారని పెళ్లి చేసుకుంటాడని అభిమానులు ఎదురుచూసినా ఏడాదిన్నరపాటు సహజీవనం చేశాక మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
రష్మిక - రక్షిత్ శెట్టి.. నిశ్చితార్థంతోనే కట్
రష్మిక తెలుగువాళ్లకి పరిచయం కాకముందే కన్నడంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరంగేట్ర సినిమా ‘కిరిక్ పార్టీ’ చేస్తున్నప్పుడే హీరో రక్షిత్‌తో నిండా ప్రేమలో మునిగిపోయింది. జులై 2017లో ఈ జంట ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఇద్దరిది చూడచక్కని జంట అని అభిమానులతో సహా అంతా అనుకున్నారు. ఈలోపు ఇద్దరు సినిమాల్లో బిజీ కావడంతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. మధ్యలో ఏమైందో తెలియదుగానీ ఏడాది తర్వాత బంధానికి బై చెప్పుకున్నారు. ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోతున్నామని ప్రకటించారు. ఇదంతా రష్మిక వల్లే జరిగిందని రక్షిత్ అభిమానులు మందన్నని తీవ్రంగా విమర్శించారు. ట్రోల్ చేశారు. ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వమని రక్షిత్ ఫ్యాన్స్‌ని కోరాడు.
అమలా పాల్-ఏఎల్ విజయ్