Chaysam Divorce: నాగచైతన్యతో విడాకుల అంశంపై మళ్లీ మళ్లీ మాట్లాడటం తనకు ఇష్టం లేదని నటి సమంత తెలిపారు. ఇటీవల ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్.. తన విడాకుల వ్యవహారంపై స్పందించారు. విడిపోయిన సమయంలో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, చనిపోవాలనుకున్నానని ఆమె అన్నారు. 2021.. తనకు వ్యక్తిగతంగా కలిసి రాలేదని ఆమె తెలిపారు. కాగా, ఇప్పుడు మరోసారి తన విడాకుల విషయమై స్పందించారు సామ్.
"మేమిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఆ మొత్తం వ్యవహారంపై నా అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పేశాను. కాబట్టి, ఇప్పుడు మళ్లీ మళ్లీ ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను" అని సమంత పేర్కొన్నారు.