తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంతతో విడాకులు​.. నాగచైతన్య ఏం అన్నారంటే? - నాగచైతన్య సమంత డివర్స్​

ChaySam divorce: సమంతతో విడాకులు తీసుకోవడంపై స్పందించారు టాలీవుడ్​ యంగ్​ హీరో నాగచైతన్య. తామిద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ChaySam divorce
నాగచైతన్య సమంత డివర్స్​

By

Published : Jan 12, 2022, 5:34 PM IST

ChaySam divorce: టాలీవుడ్​ బ్యూటిఫుల్​ కపుల్​ నాగచైతన్య-సమంత గతేడాది విడిపోయి అభిమానులను షాక్​కు గురిచేశారు. అయితే అందుకు గల కారణం కూడా తెలుపలేదు. తాజాగా 'బంగార్రాజు' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. తమ విడాకుల విషయమై స్పందించారు.

'ఇద్దరి మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్రయాణం చేయడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఒక దశాబ్దానికిపైగా స్నేహం ఉండటం మా అదృష్టం. ఇది మా మధ్య ప్రత్యేకమైన బంధాన్ని నిలిపి ఉంచుతుందని నమ్మకం. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు కావాలి. ముందడుగు వేయడానికి మాకు అవసరమైన గోప్యతని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని చైతూ అన్నారు.

కాగా, నాగచైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్​ కానుంది. ఈ మూవీలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలక పాత్ర పోషించారు.

ఇదీ చూడండి: నాగచైతన్య, సమంత.. వీరి ప్రేమకథ మాయ చేసింది!

ABOUT THE AUTHOR

...view details