కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. జేక్స్ బెజోస్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.
సాంగ్‌తో కార్తికేయ.. కొత్త చిత్రంతో కృష్ణవంశీ - కృష్ణవంశీ అన్నం
కార్తికేయ హీరోగా నటిస్తోన్న 'చావు కబురు చల్లగా' నుంచి మరో పాట విడుదలైంది. అలాగే విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
సాంగ్‌తో కార్తికేయ.. కొత్త చిత్రంతో కృష్ణవంశీ
మహా శివరాత్రి సందర్భంగా విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'అన్నం' టైటిల్‌తో రానున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.