కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం 'చావు కబురు చల్లగా'. లావణ్య త్రిపాఠి కథానాయిక. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టాడు కార్తికేయ.
నటుడు 'రంగస్థలం' మహేశ్‌తో కలసి హైదరాబాద్‌లో సందడి చేశాడు కార్తికేయ. స్వయంగా అతడే సినిమా వాల్ పోస్టర్ అంటించి, రైతు బజార్‌లో వ్యాపారులతో ముచ్చటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. "మార్చి 19న మీ బస్తీ బాలరాజ్ వస్తున్నాడు.. మీ అభిమాన థియేటర్లలో" అని మహేశ్ చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. "ప్రేక్షకులంతా చావు కబురు చల్లగా సినిమా చూసి మీ బాలరాజ్‌ని, సినిమాకు పనిచేసిన అందర్నీ ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు కార్తికేయ.