తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ సినిమా వదులుకోకూడదు అనుకున్నా: కార్తికేయ

"పుట్టుకను సంబరంగా చేసుకునే మనం మరణాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం" అని అంటున్నారు హీరో కార్తికేయ. ఆయన నటించిన కొత్త చిత్రం 'చావు కబురు చల్లగా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కార్తికేయ తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

By

Published : Mar 19, 2021, 6:40 AM IST

chavu kaburu challaga hero karthikeya interview
ఈ సినిమా వదులుకోకూడదు అనుకున్నా: కార్తికేయ

కార్తికేయ.. మాటలు వింటే పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. సహజ నటనతో మన ఇంట్లో అబ్బాయిలా తోస్తాడు. ఆహార్యం చూస్తే బాగా కసరత్తులు చేసే మన స్నేహితుల్లో ఒకడిగా కనిపిస్తాడు. 'ఆర్‌ఎక్స్‌ 100'తో యువతరంలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నటించిన కొత్త చిత్రం 'చావు కబురు చల్లగా'.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు కార్తికేయ.

  • జన్మించడాన్ని సంబరంగా చేసుకొనే మనం మరణాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? జీవన ప్రక్రియలో చావు సర్వసాధారణం. రాజ్‌కుమార్‌ హిరాణీ చిత్రాల్లో చక్కని ఫిలాసఫీని, సున్నితమైన హాస్యంతో చెబుతారు. అంతకాకపోయినా మా దర్శకుడు కౌశిక్‌ ఆ దిశగా మంచి ప్రయత్నం చేశారు.
    కార్తికేయ
  • 'ఆర్‌ఎక్స్‌ 100', 'గ్యాంగ్‌లీడర్‌' చిత్రాల్లో నా నటన చూసి తన కథలో బస్తీ బాలరాజు పాత్రకు నేను సరిపోతానని అనుకున్నారట దర్శకుడు కౌశిక్‌. కథ చెబుతుంటే నవ్వాను, భావోద్వేగానికి గురయ్యాను. ఇలా అనేక ఎమోషన్లు నన్ను చుట్టుముట్టాయి. కథ పూర్తయ్యే సరికి అసలు ఈ కథను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనుకున్నా.
  • తమిళ చిత్రం 'వాలిమై'లో అవకాశం రావడం కన్నా.. అంతపెద్ద స్టార్‌ అజిత్‌ పరిచయమే వరంగా భావించా. అది బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే కథ.
  • 'చావుకబురు చల్లగా'కు సమాంతరంగా చేస్తున్న ప్రాజెక్టు ఒకటుంది. కొత్త నిర్మాతలు, శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడుతో చేస్తున్నా. యూవీ క్రియేషన్స్‌లో ప్రశాంత్‌ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేయాలి. సుకుమార్‌ రైటింగ్స్‌లో ఇంకో చిత్రముంది.

ABOUT THE AUTHOR

...view details