కార్తికేయ, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం 'చావు కబురు చల్లగా'. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎంటర్‌టైనర్‌గా మెప్పించినా, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కాగా, డిజిటల్ మాధ్యమంలో మాత్రం విశేషంగా మెప్పిస్తోంది.
ఓటీటీలో మెప్పిస్తోన్న 'చావు కబురు చల్లగా' - ఆహాలో మెప్పిస్తోన్న చావు కబురు చల్లగా
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అంచనాల్ని అందుకోలేకపోయింది. తాజాగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఆకట్టుకుంటోంది.
చావు కబురు చల్లగా
ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదికగా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోందీ సినిమా. విడుదలైన 72 గంటల్లో 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సొంతం చేసుకుందని 'ఆహా' తెలిపింది. ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నివాసు నిర్మించారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీ ఎడిట్ చేసి, నిడివి తగ్గించారు.