నటి, నిర్మాత ఛార్మి.. త్వరలో పెళ్లి చేసుకోనుందని గత కొద్దిరోజులగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన ఈమె.. వాటిని కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లేనని తేల్చింది.
ఛార్మికి త్వరలో పెళ్లి.. స్పందించిన ముద్దుగుమ్మ - ఛార్మి విజయ్ దేవరకొండ మ్యారేజ్
తనకు పెళ్లి జరగనుందనే వార్తల్ని తోసిపుచ్చింది నటి, నిర్మాత ఛార్మి. జీవితంలో పెళ్లి అనే పొరపాటును ఎప్పటికీ చేయనని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఛార్మి
ప్రస్తుతం కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నానని చెప్పిన ఛార్మి.. ఇప్పుడున్న జీవితంతో ఆనందంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుని తప్పు చేయనని ప్రకటన విడుదల చేసింది.
పూరీ జగన్నాథ్‌తో కలిసి ఈమె.. విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' నిర్మిస్తోంది. పాన్ ఇండియా కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా ప్రభావంతో సెప్టెంబరులో రావాల్సిన ఈ చిత్ర విడుదల వాయిదా పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Last Updated : May 9, 2021, 5:58 AM IST