అక్కినేని కోడలు సమంతపై.. నటి ఛార్మి ప్రశంసల జల్లు కురిపించింది. 'ఓ బేబీ' సినిమా మంచి టాక్ అందుకున్న నేపథ్యంలో ఛార్మి ట్వీట్ చేసింది. సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చింది.
"ఏ టైమ్‌లో పుట్టావమ్మా నువ్వు.. నీ శ్రమ, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం.. నందిని రెడ్డి, మిగిలిన చిత్ర బృందం పట్ల చాలా సంతోషంగా ఉంది" అంటూ సామ్ రాక్స్, ఓ బేబీ రాక్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది ఛార్మి. ఈ ట్వీట్‌కి సామ్ రిప్లై ఇచ్చింది.