తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ సినిమా కోసం చార్మినార్​ సెట్టింగ్​! - పవన్​ క్రిష్​ సినిమా కోసం చార్మినార్​ సెట్

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ - దర్శకుడు క్రిష్​ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చారిత్రక సినిమాలో చార్మినార్​ వైభవం గురించి చెప్పనున్నారట. దీంతో చార్మినార్​ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ ప్రత్యేకమైన సెట్​ నిర్మించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

charminar set for pspk 27 movie
పవన్​ సినిమా కోసం చార్మినార్​ సెట్టింగ్​!

By

Published : Feb 9, 2021, 7:55 PM IST

పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'PSPK27' వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. చరిత్రాత్మక కథాంశంగా రానున్న ఈ సినిమాలో 17వ దశాబ్దం నాటి పరిస్థితులు చూపించనున్నారు.

ఇందులో భాగంగా చార్మినార్‌ వైభవం గురించి చెప్పనున్నారట. అధిక శాతం చార్మినార్‌పై చిత్రీకరణ జరపాల్సి రావడం వల్ల ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో చార్మినార్‌ సెట్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాకపోవడం వల్ల 'హరిహర వీరమల్లు', 'విరూపాక్ష' లాంటి పేర్లు ప్రచారంలో నిలిచాయి. "మరికొన్ని రోజుల సమయం తీసుకుని మంచి టైటిల్‌ మీ ముందుకు తీసుకొస్తామ"ని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నట్లు నిధి అగర్వాల్‌ ఇటీవల ప్రకటించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి:పవన్​ ఫ్యాన్స్​కు నిరాశ.. రెండో సాంగ్​ లేదట!

ABOUT THE AUTHOR

...view details