తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ కుర్రాడు ఛార్మికి 'ఎనర్జిటిక్​'​గా కనిపించాడట..! - ismart shankar dance charmi

ఇస్మార్ట్ శంకర్​ చిత్రంలోని 'దిమాక్ ఖరాబ్' పాటకు అదిరిపోయే స్టెప్పులతో... ఛార్మీ మనసు దోచేశాడు ఓ కుర్రాడు. అతడిని ప్రశంసిస్తూ ట్విట్టర్లో వీడియో షేర్ చేసిందీ అందాల భామ.

charmi tweet on ismart shankar dance
ఛార్మీ

By

Published : Nov 28, 2019, 4:56 PM IST

ఓ గల్లీ కుర్రాడు తన డ్యాన్స్​తో ఛార్మీని ఫిదా చేశాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ ముద్దుగుమ్మ మనసు దోచేశాడు. ఈ విషయాన్ని ఛార్మీనే స్వయంగా చెప్పింది. 'అమేజింగ్ మ్యాన్' అని ట్విట్టర్లో అతడి వీడియోను షేర్ చేసింది.

"అమేజింగ్‌ మ్యాన్. ఎంతో ఛార్మింగ్, ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. నేను అక్కడ ఉంటే నీతో కలిసి డ్యాన్స్‌ చేసేదాన్ని" - ఛార్మీ, హీరోయిన్​

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని 'దిమాక్ ఖరాబ్' పాట అభిమానులను ఉర్రూతలూగించింది. ఇదే పాటకు డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నాడీ కుర్రాడు. సినిమాలోని రామ్​ తరహాలోనే స్టెప్పులేస్తూ నెటిజన్లను ఆకర్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: 'మెగాస్టార్ వ‌ల్లే మా సినిమాకు క్రేజ్ వ‌చ్చింది'

ABOUT THE AUTHOR

...view details