ఎనర్జిటిక్ హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రబృందం.
'మంచి అబ్బాయి పాత్రలు చేసి బోర్ కొట్టింది' - puri jagannadh
" విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా నన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్న అభిమానులందరికీ ఇస్మార్ట్ శంకర్ అంకితం" అని మాట్లాడాడు ఎనర్జిటిక్ హీరో రామ్. శనివారం హైదరాబాద్‌లో 'ఇస్మార్ట్ శంకర్' విజయోత్సవ వేడుకలో చిత్రబృందంతో సహా పాల్గొన్నాడు.
"ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకే చాలా కిక్ వచ్చింది. మంచి అబ్బాయి పాత్రలు చేసి బోర్ కొట్టింది. విభిన్నమైన పాత్ర చేయాలని ఉందని పూరిగారికి చాలాసార్లు చెప్పాను. నాకోసం ఆయన ఇస్మార్ట్ శంకర్ పాత్రను సృష్టించారు. ఈ సినిమా మరో పదేళ్ల పాటు గుర్తుండిపోతుంది."
--రామ్ పోతినేని, సినీ నటుడు.
ఈ వేడుకలో ఛార్మి భావోద్వేగంతో మాట్లాడింది. సరైన సమయంలో ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అందుకున్నట్లు చెప్పింది. ఆకలితో ఉన్నప్పుడు రామ్ అందరికీ అన్నం పెట్టినట్లు విజయాన్ని పోల్చి చెప్పింది. పూరిపై నమ్మకంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడని... అతడితో అనుబంధం మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే చిత్రం రూ.75 కోట్ల వసూళ్లు సాధించిందని హర్షం వ్యక్తం చేసిందీ స్టార్ హీరోయిన్.