దక్షిణాదిలో ప్రస్తుతం హీరోయిన్‌గా వెలుగొందుతున్న త్రిష పుట్టిన రోజు ఈ రోజు. పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. హీరోయిన్ చార్మి మాత్రం కాస్త వినూత్నంగా చెప్పింది. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ట్విట్టర్ వేదికగా ప్రేమను వ్యక్తపరిచింది.
'త్రిష.. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం' - త్రిష
హీరోయిన్ త్రిష పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది చార్మి. ట్విట్టర్ వేదికగా మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ప్రేమను వ్యక్తపరిచింది.
‘బేబీ నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. నా ప్రతిపాదనను అంగీకరించేది ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా’ -ట్విట్టర్లో చార్మి
దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చిన వీరిద్దరూ హీరోయిన్స్‌గా పలు చిత్రాల్లో కనిపించారు. 'పౌర్ణమి' సినిమాలో కలిసి నటించారు. త్రిష ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతుండగా, చార్మి మాత్రం నటనకు దాదాపు గుడ్ బై చెప్పి సినీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి పీసీ కనెక్ట్ సంస్థలో సినిమాలు నిర్మిస్తోంది.