తల్లితోనో, తండ్రితోనో వారి పిల్లలు నటించడం చాలా సినిమాల్లో చూశాం. కానీ తండ్రికి తల్లిగా కూతురు నటించిన విషయం మీకు తెలుసా!
తన హాస్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా 1992లో ఆయన పేరుతో ఓ సినిమా తీశారు. ఇందులో చార్లీ తల్లి హానా చాప్లిన్ పాత్రను ఆయన కూతురు గెరాల్డిన్ చాప్లిన్ పోషించింది.అంటే నానమ్మ పాత్రలో మనవరాలే నటించిందన్న మాట.
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ చార్లీ చాప్లిన్ పాత్ర పోషించాడు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా సినిమాల్లో జరిగాయి. 2009లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'పా' లో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ తండ్రీకొడుకులుగా నటించారు. ఇక్కడ విశేషమేమంటే తండ్రి పాత్రను అభిషేక్ పోషించగా.. కొడుకు పాత్రలో అమితాబ్ మెప్పించారు.