తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మార్పు కోసం ప్రయత్నించేవాడే నాయకుడు' - pawan kalyan

ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన పవన్​ కల్యాణ్​కు మద్దతుగా మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్ షేర్ చేశాడు.

చరణ్

By

Published : May 25, 2019, 9:44 AM IST

"మార్పును తెచ్చేందుకు ప్రయత్నించే వాడే నిజమైన నాయకుడు"’ అంటున్నాడు టాలీవుడ్ కథానాయకుడు రామ్‌ చరణ్‌. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్ని ఉద్దేశిస్తూ శుక్రవారం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ షేర్ చేశాడీ మెగా హీరో.‘

"గొప్ప నాయకుడు.. తాను నాయకుడు అనిపించుకోవాలని అనుకోడు. మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వాడే నిజమైన నాయకుడు. పదవి ఏంటనేది ముఖ్యం కాదు, లక్ష్యం ఏంటనేదే ముఖ్యం. జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌ గారికి మద్దతుగా ఉండి, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’" అంటూ ఏపీ ఎన్నికలు 2019 అనే హ్యాష్‌ట్యాగ్‌ను రామ్‌ చరణ్‌ జత చేశాడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓటమి పాలయ్యాడు పవన్​. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోగా.. గాజువాకలో వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలోనూ పరాజయం పాలయ్యాడు. భారీ అంచనాల మధ్య ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇవీ చూడండి.. నటుడు.. దర్శకుడు.. ఇప్పుడు ప్రతినాయకుడు

ABOUT THE AUTHOR

...view details