కరోనా బారిన పడ్డ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాజాగా బాలు ఆరోగ్య విషయమై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చారు.
నాన్న కోలుకుంటున్నారు.. బాలు ఆరోగ్యంపై చరణ్ - ఎస్బీబీ కరోనా
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం గురించి తనయుడు చరణ్ వివరణ ఇచ్చారు.
నాన్న కోలుకుంటున్నారు.. బాలు ఆరోగ్యంపై చరణ్
"నాన్నకు మెరుగైన వైద్యం కోసం అధునాతన ఐసీయూకి మార్చారు. నాన్న ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ప్రాణాధార వ్యవస్థపై ఉన్నా వైద్యులను గుర్తిస్తున్నారు. నాన్న ఇప్పుడు కాస్త సులువుగా శ్వాస తీసుకుంటున్నారు. కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు" అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో షేర్ చేశారు చరణ్.
Last Updated : Aug 17, 2020, 6:02 PM IST