చార్లీ చాప్లిన్.. తన హాస్యంతో అందరినీ నవ్వుల లోకంలో విహరింపజేశాడు. ఎప్పుడూ నవ్వుల పువ్వులు పూయించే చార్లీ ఓసారి భావోద్వేగానికి లోనయ్యాడు. బాధతో కాదులేండి ఆనందంతోనే. 1972లో ఆస్కార్ అవార్డు అందుకునే సమయంలో ప్రేక్షకులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి భావోద్వేగం చెందాడు చార్లీ.
మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాల వరకు చార్లీ ప్రస్థానం మరువలేనిది. సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతకుగానూ 1972లో ఆస్కార్ కమిటీ ఓ పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు అందుకోవడం కోసం చాప్లిన్ వేదికపైకి రాగానే వేలాది మంది ఒక్కసారిగా నిలబడి గౌరవ సూచకంగా చప్పట్లు కొట్టడం(స్టాండింగ్ ఒవేషన్) మొదలుపెట్టారు.